ఈ ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల లేదు : సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

by Ratna Kumari |

ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి టారిఫ్ పెంపుద‌ల లేద‌ని సీఎండీ క‌ర్నాటి వ‌రుణ్ రెడ్డి తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల లేదు : సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి
X

దిశ, హన్మకొండ టౌన్ : తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన బహిరంగ విచారణలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా వ్యాపారం కోసం సవరణ చేయబడిన సమగ్ర ఆదాయ అవసరాలు విద్యుత్ ధరల ప్రతిపాదనలు ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతి పాదనలపై కలెక్టరేట్ లో నిర్వహించిన బహిరంగ విచారణలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, మెంబర్ ఫైనాన్స్ చెరుకూరి శ్రీనివాస రావు, రఘు కంచెర్ల మెంబర్ టెక్నికల్ కు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సమగ్ర వివరాలను వివరించారు. ఎన్పీడీసీఎల్ లో చేపడుతున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధి, వినియోగదారులకు అందిస్తున్న సేవలు, డిజిటల్ కార్యక్రమాలు, భద్రతా చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల లేదని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు.

సుమారు 143.94 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయబడుతోందని, సంస్థకు 70.29 లక్షల వినియోగదారులు ఉండగా తలసరి విద్యుత్ వినియోగం 1680 యూనిట్లు గా ఉందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ నెట్వర్క్ వ్యవస్థ 400 కేవీ సబ్ స్టేషన్లు, 220 కెవి 44, 132 కేవీ 99, 33 కేవీ 1528, పిటిఆర్ 2594 ఉన్నాయన్నారు.70 లక్షల 23 వేల సర్వీసులకు సరఫరా అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో అత్యధిక పీక్ డిమాండ్ 6441 మెగావాట్ల చేరుకుందని, ఎక్కడ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించామన్నారు. నెట్ వర్క్ వ్యవస్థ ను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటివరకు 150 కొత్త 33/11 కేవీ అవుట్‌డోర్ సబ్ స్టేషన్లు 150, ఇండోర్ సబ్ స్టేషన్లు 5,కొత్త సబ్ స్టేషన్ లకు అనుసంధానించబడిన 701 కి.మీ 33 కేవీ లైన్లు,1096 కి.మీ 11 కేవీ లైన్లు,870 కి.మీ ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేయబడ్డాయని చెప్పారు.

అదేవిధంగా పాత సబ్ స్టేషన్లను పునరుద్ధరించడం, 634 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లను త్రీ ఫేజ్‌గా మార్పు చేయడం వంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో 246 మార్చబడినవన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే విజిలెన్స్ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని ఇందులో వాట్సాప్ చాట్ బాట్, టోల్ ఫ్రీ నెంబర్ 1912 ద్వారా కానీ, టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ట్రాన్స్ఫార్మర్ల తరలింపు డిపార్ట్మెంట్ వెహికల్ ద్వారానే అదే రోజు చేస్తున్నామని 208 వాహనాలు లో చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ ప్రమాదలను 22% కు తగ్గించామని అన్నారు. ఖమ్మం , మహబూబాబాద్ లో కాలం చెల్లిన నెట్ వర్క్ ను మారుస్తున్నామని చెప్పారు. పీనల్ చార్జీల రద్దు అంశం సంతోషకరం బొమ్మినేని రవీందర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరంగల్ అధ్యక్షుడు పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని సర్ చార్జీలు సర్చార్జీలు పెంచొద్దని ఎండి చార్జీలు తగ్గించాలని అలాగే పీనల్ చార్జీలు కూడా తగ్గించాలని కమిషన్ కోరగా సంస్థ సీఎం సానుకూలంగా స్పందించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. 38 మంది వినియోగదారులు అభ్యంతరాలు లేవనెత్తగా సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి సమాధానం ఇస్తూ గ్రామపంచాయతీలో వ్యవసాయానికి సంబంధించి ఓ ఆర్ సి కరపత్రం అందిస్తున్నామని చెప్పారు.

గిరిజన ప్రాంతాల విద్యుద్దీకరణ

గిరిజన ప్రాంతాల్లో విద్యుద్దీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద అనేక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. పిఎం జేఏఎన్ ఎంఏఎన్ పథకం కింద దూర ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు ఆన్-గ్రిడ్ ద్వారా 3360 హెచ్ హెచ్, ఆఫ్ గ్రిడ్ ద్వారా 90 హెచ్ హెచ్ విధానాల్లో విద్యుద్దీకరణ పూర్తిచేయబడిందని అన్నారు. అలాగే ఎస్ టి ఎస్ డి ఎఫ్ పథకం ద్వారా గిరిజన ఆవాసాల్లో విద్యుత్ నెట్‌వర్క్ విస్తరణ చేపట్టబడిందనీ,2222 ఆవాసాలను గుర్తించి, ఇందులో 2072 పూర్తి అయ్యాయని వివరించారు.

పునరుత్పాదక శక్తి ప్రోత్సాహం

పర్యావరణ పరిరక్షణ విద్యుత్ నష్టాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకుని PM కుసుమ్ పథకం కింద డిస్ట్రిబ్యూటెడ్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేపట్టబడింది. ఈ పథకం కింద 643 మెగావాట్ల సామర్థ్యం కోసం 447 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం కింద గ్రామాలను సౌర విద్యుత్ ఆధారిత స్వయం సమృద్ధి గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి అని చెప్పారు.

డిజిటల్ సేవలు - ఆధునిక సాంకేతికత

విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అంతరాయాలను తగ్గించడానికి సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టింది. ఎస్సీ ఏ డి ఏ ఆధారిత సబ్ స్టేషన్ మానిటరింగ్రి యల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా 464 సబ్ స్టేషన్లు స్కాడ కి అనుసంధించడం జరిగిందన్నారు. ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు 2285 కూడా స్కాడ కు అనుసంధించేయమన్నట్లూ తెలిపారు.

33 పట్టణాలకు జీఐఎస్ ఆధారిత నెట్‌వర్క్ మ్యాపింగ్

డ్రోన్, AI ఆధారిత పర్యవేక్షణ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు అమలు చేయబడుతున్నాయనీ చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు వినియోగదారులకు సులభమైన సేవలందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ అనేక డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదుల నమోదు మరియూ ఆన్‌లైన్ బిల్లింగ్ మరియు చెల్లింపులు ఎస్ఎం ఎస్ అలర్ట్ సేవలు, మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త కనెక్షన్లు కస్టమర్ కేర్ సెంటర్ (1912) ద్వారా 24 గంటల సేవలు అందించబడుతున్నాయనీ వివరించారు.

భద్రతా చర్యలు

విద్యుత్ ప్రమాదాలను తగ్గించడానికి నెట్‌వర్క్ మరమ్మతులు, భద్రతా చర్యలలో భాగంగా 68.21 కోట్లు వ్యయంతో 14090 మధ్య స్తంభాలు వేశామని,వంగిన స్తంభాలు సరిచేసిననవి 5987 , సరిద్దిదిన లూస్ లైన్లు 23941 కిలోమీటర్లు ట్రాన్స్ఫార్మర్ల ఏర్తింగ్ 8000 పునరుద్ధరించామని చెప్పారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే రైతులకు మరియు వినియోగదారులకు విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక సంవత్సరానికి రూ. 12,521 కోట్ల రెవెన్యూ లోటుతో రూ. 22,754 కోట్ల మొత్తం సమగ్ర ఆదాయ ఆవశ్యకత ఆమోదించాలని టిజీ ఎన్పీడీసీఎల్ కమిషన్ ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుండి రూ. 12,521 కోట్ల సబ్సిడీ మద్దతు అవసరాన్ని అంచనా వేస్తూ ఈ ఫైలింగ్‌లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మరింత మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా, సేవలు అందించడానికి ఇంకా కృషి చేయాలని అన్నారు. జలగం ప్రసాదరావు మాజీమంత్రి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ సీఎండీ పనితీరు చాల బాగుందని, సాంకేతికతను అంది పుచ్చుకొని కొత్త సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు కొత్త ఉద్యోగ నియమాకలు చేపట్టాలని, సబ్ స్టేషన్ లో పూర్తిగా ఆపరేటర్లను నియమించాలని, కొత్తగా 220 కెవి నుండి 33 కేవీ కొత్త లైన్ కమలాపూర్ వేయాలని, భద్రాద్రి కొత్తగూడెం గుండాలలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు . ఎక్కడైతే లో వోల్టేజ్ ఉంటుందో అక్కడ నిర్మించాలని చెప్పారు . ఇళ్ల మీద నుండి వేసే లైన్లను మార్చాలని, లూస్ లైన్ ఉన్నచోట మధ్య స్తంభాలు వెయ్యాలని, పాత కాలంనాటి కండక్టర్ మార్చాలని చెప్పారు. సింగిల్ ఫేస్ నుంచి త్రి ఫేజ్ కు మార్చాలని అన్నారు.

శ్రీధర్ రెడ్డి భారత కిసాన్ సంఘ సభ్యులు మాట్లాడుతూ రైతులకు ఓఆర్సి రుసుము చెల్లించకుండా తీసుకున్న నిర్ణయానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మధ్య తరగతి , రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని , అలాగే ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లించాలని కోరారు . లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్ బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఉండాలన్నారు. శశిభూషణ్ కాచే భారత కిసాన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ బకాయిలు వసూలు చేయాలని చెప్పారు . విద్యుత్ ప్రమాదంతో చనిపోయిన వారికి కోటి రూపాయల భీమా వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఇది మంచి పరిణామమని చెప్పారు . మేడారంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించారని అలాగే రాబోయే గోదావరి పుష్కరాలకు సమాయత్తం కావాలని కోరారు.

Next Story