కొత్త గుడిసెలను అనుమతించేది లేదు : డిప్యూటీ డీఆర్వో కోటేశ్వర్

by Elthuri vijay kumar |

మండల కేంద్రం సమీపం కోమటిపల్లి రోడ్డులోని సండ్రోని వొర్రె అటవీ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకోని శాంతినగర్ పేరుతో నివాసం ఉన్న గొత్తికోయలు ఇటీవల మళ్లీ కొత్త గుడిసెలు వేయడానికి యత్నించడంతో ఫారెస్టు అధికారులు అడ్డుకుని గుడిసెలను పీకేసినట్లు డీఆర్వో కోటేశ్వర్ తెలిపారు.

కొత్త గుడిసెలను అనుమతించేది లేదు : డిప్యూటీ డీఆర్వో కోటేశ్వర్
X

కొత్త గుడిసెలను అనుమతించేది లేదు : డిప్యూటీ డీఆర్వో కోటేశ్వర్

దిశ, మంగపేట : మండల కేంద్రం సమీపం కోమటిపల్లి రోడ్డులోని సండ్రోని వొర్రె అటవీ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకోని శాంతినగర్ పేరుతో నివాసం ఉన్న గొత్తికోయలు ఇటీవల మళ్లీ కొత్త గుడిసెలు వేయడానికి యత్నించడంతో ఫారెస్టు అధికారులు అడ్డుకుని గుడిసెలను పీకేసినట్లు డీఆర్వో కోటేశ్వర్ తెలిపారు. సోమవారం సీపీఎం నాయకులు శాంతినగర్ సందర్శించి తొలగించిన గుడిసెలను పరిశీలించి ఫారెస్టు అధికారులు, గొత్తికోయలతో మాట్లాడారు. ఈ విషయంలో ఎస్సై టీవీఆర్ సూరి, డీఆర్వో కోటేశ్వర్ మాట్లాడుతూ.. శాంతినగర్ లో ఇప్పటికే వేసుకున్న గుడిసెలలోనే వారు ఉండాలని కొత్త గుడిసెలు వేసుకోడానికి ఎలాంటి అనుమతిలేదని తేల్చి చెప్పారు. ఫారెస్టు ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి కొత్త గుడిసెలు వేయవద్దని తేల్చి చెప్పారు.

Next Story