లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం

by velandi.Saikiran |

పలిమెల మండలంలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది.

లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం
X

దిశ, (పలిమెల) మహదేవపూర్: పలిమెల మండలంలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ఇలాంటి బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డలో సంభవించింది. మంగళవారం సాయంత్రం సుమారు మూడు గంటలకు సుడి గాలులు ఏర్పడ్డాయి. దాదాపు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బీభత్సం జరగిందని రైతులు తెలిపారు.

ఎద్దుల బండ్లు కూడా ఈ ఉదృతికి కొట్టుకుపోయాయి. సుమారు పది ఎకరాల వ‌ర‌కు పత్తి, మిర్చి వంటి పంటలన్నీ మీద నష్టపోయామని రైతులు తెలిపారు. అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, తుఫానుల కారణంగానే గోదావరి బెల్ట్ వెంబడి ఇలాంటి పరిణామాలు ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.

Next Story