- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలు.. రాష్ట్ర సభ్యుడికి ఆర్థిక సహాయం
జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థి కార్తీక్, జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనేందుకు ధర్మసాగర్ గ్రామ యువత, పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం చేశారు.

దిశ, ధర్మసాగర్: జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థి కార్తీక్, జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనేందుకు ధర్మసాగర్ గ్రామ యువత, పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం చేశారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో రాణించాడు కార్తిక్. మార్చి మొదటి వారంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయస్థాయి చాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టు లో సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఈ పోటీలలో పాల్గొనేందుకు వీలుగా ధర్మసాగర్ గ్రామ యువ నాయకుడు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు చంద్రశేఖర్, ప్రశాంత్ ,మాచర్ల కుమార్, నక్క శీను, కొలిపాక అశోక్ కౌశిక్ లతోపాటు 4 వార్డ్ మెంబర్ భానుచందర్ 14వ వార్డు మెంబర్ రఘు తదితరులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ధర్మ ప్రకాష్ అధ్యక్షతన "క్రీడలకు భరోసా" సదస్సు నిర్వహించారు. ఈ తరుణంలోనే కార్తీక్ కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, రాజమ్మ ,రామకృష్ణ, రమ్యశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.






