- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచిన అనంతరమే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ వాగ్దానాన్ని తుంగలో తొక్కి గ్రామపంచాయతీ ఎన్నికలను బీసీలకు 17 శాతం రిజర్వేషన్ తోనే నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి మోడీ పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదించి రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్లో చేర్చాలని వెంకట్ రాములు డిమాండ్ చేశారు.






