- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతల రహదారితో వాహనదారుల ఇబ్బందులు
మహాముత్తారం మండలకేంద్రానికి నరేపాచెట్టు ( లంబాడి పల్లి ) నుంచి నిర్మించిన తారు రోడ్డు గుంతలు ఏర్పడి వాహనాలు దెబ్బతింటున్నాయి. గత 15 సంవత్సరాల క్రితం రోడ్డుని నిర్మించారు.

దిశ, మహాముత్తారం : మహాముత్తారం మండలకేంద్రానికి నరేపాచెట్టు ( లంబాడి పల్లి )నుంచి నిర్మించిన తారు రోడ్డు గుంతలు ఏర్పడి వాహనాలు దెబ్బతింటున్నాయి. గత 15 సంవత్సరాల క్రితం రోడ్డు ని నిర్మించారు. మధ్యలో ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి ప్యాచ్ వర్క్ చేశారు. అప్పటి నుంచి సంబంధిత అధికారులు పట్టించుకోకుండా వదిలేయడంతో భారీగా గుంతలు ఏర్పడి ప్రయాణం ప్రాణ శంకటంగా మారిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈ రహదారి మండల కేంద్రానికి కోర్లకుంట స్థంభపల్లి, వాజీనేపల్లి, ములుగుపల్లి, మాదారం, జిల్లపల్లి, గ్రామపంచాయతీ ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి మరమ్మత్తులు చేయకపోవడంతో మరో ఐదు కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే రహదారి పై ఉన్న గుంతలు పూడ్చి వేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.






