- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్న తల్లి కడగండ్లకేనా..?.. ఆస్తి కోసం కొడుకుతో తల్లిదండ్రుల పోరాటం
“తనతోపాటు భర్తను కూడా కొడుతూ, ఆస్తి కోసం పోలీసులు చుట్టూ తిప్పిస్తున్నాడు… మా చిన్న కొడుకు మదన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన పట్టాను రద్దు చేయండి..!” అంటూ కన్న తల్లి పసునూరి సుశీల కన్నీళ్లు పెట్టుకున్నారు.

దిశ, హనుమకొండ: “తనతోపాటు భర్తను కూడా కొడుతూ, ఆస్తి కోసం పోలీసులు చుట్టూ తిప్పిస్తున్నాడు… మా చిన్న కొడుకు మదన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన పట్టాను రద్దు చేయండి..!” అంటూ కన్న తల్లి పసునూరి సుశీల కన్నీళ్లు పెట్టుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇలాంద గ్రామానికి చెందిన పసునూరి సుశీల–రామ్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు జరిపి, తల్లిదండ్రులుగా తమ బాధ్యతను ముగించామని సుశీల చెబుతున్నారు.
వారు ఉన్న 18 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు ఎనిమిది ఎకరాల చొప్పున పంచి, మిగిలిన రెండు ఎకరాలను తమ జీవనోపాధి కోసం ఉంచుకున్నామని ఆమె వివరిస్తున్నారు. అయితే... చిన్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ రెండు ఎకరాలపై కూడా కన్నేశారు. భార్య మాటలు విని, తల్లిదండ్రుల పట్ల విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.
“ఆస్తి కోసం మాకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నాడు… మనుషుల్ని పంపించి బెదిరింపులకు దిగాడు. దీంతో ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరాన్ని మళ్లీ ఇద్దరు కొడుకులకు సమానంగా ఇచ్చామని, ఇక మిగిలిన ఒక్క ఎకరం తమ జీవనాధారమని తల్లిదండ్రులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతో బతుకుతున్న సుశీల, రామ్ రెడ్డి దంపతులు ప్రస్తుతం పెద్ద కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. కానీ అందుకే చిన్న కొడుకు పెద్ద కొడుకుతోనూ గొడవలు పెట్టుకుంటున్నాడట.
ఈ నేపథ్యంలో, తమ తలనొప్పులకు తెరదించేందుకు, మదన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన భూమి పాస్ బుక్‌ను రద్దు చేసి తిరిగి తమ పేరుపై మార్చాలని కోరుతూ, వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో అప్లికేషన్ ఇవ్వాలని వచ్చారు. అయితే గ్రీవెన్స్ రద్దవడంతో తమ గాయాన్ని మీడియా ముందే ఆవేదనగా వెల్లగక్కారు.






