అత్యాధునిక టెక్నాలజీతో మొబైల్ ఫోన్ గుర్తించవచ్చు

by Ratna Kumari |

అత్యాధునిక టెక్నాలజీతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సులభంగా గుర్తించవచ్చని ఎస్ఐ శ్రావణ్ కుమార్ అన్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో మొబైల్ ఫోన్ గుర్తించవచ్చు
X

దిశ, చిట్యాల : అత్యాధునిక టెక్నాలజీతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సులభంగా గుర్తించవచ్చని ఎస్ఐ శ్రావణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో వివిధ గ్రామాలకు చెందిన నలుగురు బాధితులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకొని ఫిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, సంబంధిత బాధితులైన సర్వ శరత్ కుమార్, అనుప మహేష్ ,దువ్వల ప్రవీణ్, మేకల గణేష్ లకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే అధైర్య పడకుండా పోలీస్ స్టేషన్ లో గాని, సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరికైనా ఇతరుల మొబైల్ ఫోన్ దొరికితే, వెంటనే పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని, వాటిని అక్రమంగా వినియోగించడం నేరమని హెచ్చరించారు. బాధితులు ఎస్సై శ్రావ‌ణ్ కుమార్, కానిస్టేబుల్ లాల్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story