- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ ఎత్తుకున్న ఎమ్మెల్యే రేవూరి
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పండుగ సద్దుల బతుకమ్మ. ఈ వేడుకలను తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరిగాయి

దిశా, పరకాల: తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పండుగ సద్దుల బతుకమ్మ. ఈ వేడుకలను తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరిగాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ జరుగుతోంది. పరకాలలో కూడా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కే సుష్మ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో ఆడపడుచులు ఆటపాటలతో అలరిస్తూ చివరగా గంగమ్మ చెంతకు చేరేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్థానిక దామర చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు.
ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ,అవంచనియ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. బతుకమ్మను కూడా ఎత్తుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సద్దుల బతుకమ్మ వేడుకలను తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు స్థానిక నాయకులు ,కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.






