ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి పాడిన ఎమ్మెల్యే నాగరాజు

by velandi.Saikiran |

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46, 64వ డివిజన్ల పరిధి లోని మడికొండ మెట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపం

ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి పాడిన ఎమ్మెల్యే నాగరాజు
X

దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46, 64వ డివిజన్ల పరిధి లోని మడికొండ మెట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడబిడ్డలతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బతుకమ్మ ఆడి వారితో కలిసి పాడారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.ఎంగిలి పూలతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో శోభాయమానంగా ముగిసిన ఈ తొమ్మిది రోజులు ఆడపడుచుల ఆనందాల ఉత్సవమని తెలిపారు. తల్లి గౌరమ్మను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగలో భాగంగా మహిళలు ఆరాటంగా పూలను సేకరించి, వాటిని అందంగా అలంకరించి ఆడడం సంస్ర్కుతి కి నిదర్శనం అన్నారు.

Next Story