క‌డియం శ్రీహ‌రికి అవ‌మానం..జాతర ఫ్లెక్సీలో కానరాని ఫోటో !

by velandi.Saikiran |

స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

క‌డియం శ్రీహ‌రికి అవ‌మానం..జాతర ఫ్లెక్సీలో కానరాని ఫోటో !
X

దిశ, ధర్మసాగర్: స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీచర మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్లెక్సీ లలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటో కాన‌రాలేదు. ఈ త‌రుణంలోనే వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతర ఛైర్మన్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైరయ్యారు. జాతర ఆవరణలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీ లలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటో లేకపోవడంతో విస్మయానికి గురయ్యారు. జాతర ఏర్పాట్లకు రూ.3.5 లక్షలు మంజూరు చేస్తే ఇదేనా మీరు ఇచ్చే గౌరవమని మండిపడ్డారు.

Next Story