దమ్మున్న వార్త పత్రిక ''దిశ'': MLA ఈటల రాజేందర్

by Satheesh |   (  Updated:2023-01-06 13:59:56  IST  )

వరంగల్ పర్యటనలో భాగంగా బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓరుగల్లుకు వెళ్లారు.

దమ్మున్న వార్త పత్రిక దిశ: MLA ఈటల రాజేందర్
X

దిశ, ఖిలా వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓరుగల్లుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ జిల్లా ''దిశ'' దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన వార్త పత్రిక ''దిశ'' అని కొనియాడారు. దమ్మున్న పత్రికల్లో దిశ పత్రికి ఒక మైలరాయికి చేరిందని కితాబిచ్చారు. త్వరలోనే పత్రికా రంగంలో ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల దశను మార్చేది దిశే అవుతుందని ఆకాంక్షించారు.

Next Story