- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదృశ్యమైన ఆరేళ్ల బాలుడి కథ విషాదంగా ముగిసింది..
గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామ శివారులోని లక్ష్మణ్ తండా కు చెందిన వాంకుడోత్ జాన్ పాల్ బుధవారం రాత్రి అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది.

దిశ, గూడూరు : గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామ శివారులోని లక్ష్మణ్ తండా కు చెందిన వాంకుడోత్ జాన్ పాల్ బుధవారం రాత్రి అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది. శుక్రవారం ఉదయం భూపతి పేట గ్రామ చెరువులో జాన్ పాల్ శవమై తేలాడు. పూర్తి వివరాల్లోకి వెళితే లక్ష్మణ్ తండాకు చెందిన కృష్ణమూర్తి సునీత దంపతుల కుమారుడు. జాన్ పాల్ తన తండ్రి తో కలసి బంధువుల ఇంట్లో బుధవారం శుభకార్యానికి ఆటోలో వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో తండ్రి కుమారులు ఇద్దరు ఆటో పక్కకు ఉంచి నిద్ర పోయారు. తండ్రి లేచి చూసేసరికి కుమారుడు కనపడక పోవడంతో చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభించలేదు. వెంటనే గూడూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సమాచారం అందించడంతో గత రెండు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం భూపతి పేట గ్రామ శివారులోని చెరువులో ఒక బాలుడు మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి విచారణ చేస్తున్నారు. బాలుడు మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడ లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అంశంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు..






