- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలకుర్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యే
by Taduka Kalyani |
మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయం భూ శ్రీ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దంపతులు మహాభిషేకం నిర్వహించారు.

X
దిశ, పాలకుర్తి: మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయం భూ శ్రీ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దంపతులు మహాభిషేకం నిర్వహించారు.
వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారికి వేదాశీర్వచనం అందించారు. మంత్రి ఎమ్మెల్యేను పూజారులు శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story






