ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌ని మంత్రి సీత‌క్క‌ని నిల‌దీయాలి

by Ratna Kumari |

ప్ర‌జా పాల‌న పేరుతో కోడ‌లిని జ‌డ్పీ చైర్మ‌న్ చేయ‌డం కోసం వ‌స్తున్న మంత్రిని తీయండ‌ని డా. జాడి రామ‌రాజు నేత పిలుపునిచ్చారు.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌ని మంత్రి సీత‌క్క‌ని నిల‌దీయాలి
X

దిశ, ఏటూరు నాగారం : ప్ర‌జా పాల‌న పేరుతో కోడ‌లిని జ‌డ్పీ చైర్మ‌న్ చేయ‌డం కోసం వ‌స్తున్న మంత్రిని తీయండ‌ని డా. జాడి రామ‌రాజు నేత పిలుపునిచ్చారు. ఏటూరు నాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు. నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి సీతక్క ప్రతి పక్షంలో ఉండగా.. ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చిన చరిత్ర లేని మంత్రి కన్నాయిగూడెం మండలంలో పర్యటన చేయ‌డానికి కారణం ఏమిటి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2సంత్సరాల 6నెలలు మంత్రి గా పదవి భాద్యతలు పూర్తి చేసుకున్నా.. మంత్రి కంతనపల్లి చెరువులో కంతనపల్లి రోడ్ మీద పిడికెడు మట్టి పోసావా, లేక కోడలును జడ్పీ చైర్మన్ చేయ‌డం కోసం మంత్రి ప్రజాపాలన పేరుతో స్థానిక ఎన్నికల్లో ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయ‌డానికి క‌న్నాయిగూడెం మండ‌ల ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

ఐలపురం కు రోడ్ ఏమైంది..? దేవాదుల లిప్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు ఎక్కడి రైతులకు ఇస్తున్నారో ఈ ప్రాంత ప్రజలకు చెప్పిన తర్వాత పర్యటన చేస్తే బాగుండేది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోని రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నాయకులు అవినీతి అక్రమాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్నాయిగూడెం మండలం కు ఇచ్చిన నిధులు ఏమిటో చెప్పాలని అన్నారు. నాడు ఎమ్మెల్యే గా ఉండగా.. దేవాదుల లిప్ట్ ఇరిగేషన్ నుంచి మండలంలోని రైతులకు సాగు నీరు త్రాగునీరు ఇస్తామని చెప్పిన నాయకురాలుగా నీళ్లు ఇచ్చారా అన్నారు. అధికారం లోకి రాగానే నీళ్లు ఇస్తాన‌ని చెప్పిన మంత్రి ఒక్క ఇంచు భూమికి కూడా నీళ్లు ఇచ్చారా అన్నారు. దేవాదుల లిప్ట్ ఇరిగేషన్ నుంచి మైదాన ప్రాంత రైతులకు నీళ్లు తీసుకెళ్లిన మంత్రికి ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల రైతులు ఆగపడతా లేరా అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కన్నాయిగూడెం మండలం పర్యటన చేయ‌డం మంచిదే. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కోడలును జడ్పీ చైర్మన్ చేయ‌డం కోసం ఈ ప్రాంత ప్రజలను నమ్మించడానికి వస్తున్నా మంత్రి మేధావులు పత్రిక మిత్రులు నిల‌తీయాల‌ని జాడి రామ‌రాజు అన్నారు.

Next Story