- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక జెండాను ఆవిష్కరించిన-మంత్రి సీతక్క.
గురువారం ములుగు జిల్లా కేంద్రంలో సిఐటియు,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పటల్ లో హామీలీ సంఘం ఆధ్వర్యములో గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క.

దిశ, ములుగు ప్రతినిధి: గురువారం ములుగు జిల్లా కేంద్రంలో సిఐటియు,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పటల్ లో హామీలీ సంఘం ఆధ్వర్యములో గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. శ్రమ దోపిడీ విముక్తికై పోరాడండి’..అంటూ నినాదాలు చేసి,కార్మిక సంఘాలు కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించండి అనేక పోరాటాల ఫలితంగానే కార్మికులు హక్కులు సాధించుకున్నారని వివరించారు.1886లో చికాగో నగరంలో కార్మికులకు రోజుకు ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాటం చేసిన రోజును మేడేగా చేసుకుంటున్నారన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదదించి కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమములో వివిధ పార్టీల కార్మిక సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, బ్లాక్,మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






