ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-19 06:44:08  IST  )

నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, అభివృద్ధి నిండాలని కోరుకుంటున్నానని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: తెలుగు సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ ఉగాది అని, నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, అభివృద్ధి నిండాలని కోరుకుంటున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకటన విడుదల చేశారు. ప్రతి సంవత్సరం కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగే సమయమే ఉగాది అని,ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని పేర్కొన్నారు. గతాన్ని పాఠంగా తీసుకుని భవిష్యత్తును మరింత వెలుగొందించేలా ముందుకు సాగాలని, కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

రైతులు, కార్మికులు, మహిళలు, యువత ప్రతి వర్గం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని, రైతులే దేశానికి వెన్నెముక అంటూ మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని ఆశించారు. సంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పండుగలను జరుపుకోవాలని, ఉగాది పచ్చడి జీవితానికి అన్ని రుచులను సూచిస్తుందని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నింపాలని, రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి! తెలుగు ప్రజలకు ప్రధాని మోడీ విషెస్

Next Story