బీఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి .. Minister Satyavathi

by Javid Pasha |   (  Updated:2022-12-06 12:57:49  IST  )

సమాజంలోని అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

బీఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి .. Minister Satyavathi
X

దిశ, మహబూబాబాద్ టౌన్: సమాజంలోని అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొనే సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అంబేద్కర్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టారని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బిందు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story