ఉచిత మెగా క్యాన్సర్ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

by S Gopi |

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో... Minister KTR inaugurated free mega cancer camp

ఉచిత మెగా క్యాన్సర్ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
X

దిశ, పర్వతగిరి: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాన్సర్ శిబిరాన్ని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మా రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంత‌కుముందు మంత్రి కేటీఆర్ కి మంత్రి ఎర్రబెల్లి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

Next Story