- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిజంలో కొత్తదనానికి చిరునామా 'దిశ'.. మంత్రి ఎర్రబెల్లి
జర్నలిజంలో కొత్తదనానికి దిశ దిన పత్రిక చిరునామాగా నిలుస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు.

దిశ, వరంగల్ బ్యూరో: జర్నలిజంలో కొత్తదనానికి దిశ దిన పత్రిక చిరునామాగా నిలుస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. ఎప్పటికప్పుడు వార్తలను అందించడం అనే విధానం బాగుందని అన్నారు. అత్యంత తక్కువ కాలంలోనే కోట్లాది మంది పాఠకులను సంపాదించుకుని దిశ చరిత్ర సృష్టించిందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం దిశ క్యాలెండర్‌ను జనగామ కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దిశ దిన పత్రిక ప్రజల పక్షం నిలుస్తూ.. ఎల్లప్పుడూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాక్షించారు. ఆవిష్కరణలో దిశ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్ ఆరెల్లి కిరణ్ గౌడ్, దిశ రిపోర్టర్లు ఉమ్మాల సందీప్, బండి రామారావు, ఆడెపు అశోక్, క్యాడిడేట్ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.






