ముప్పనపల్లిలో మెగా రక్తదాన శిబిరం

by Elthuri vijay kumar |

సహాయ నిధి ఫౌండర్ అబ్బు సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు

ముప్పనపల్లిలో మెగా రక్తదాన శిబిరం
X

ముప్పనపల్లిలో మెగా రక్తదాన శిబిరం

- సహాయ నిధి ఫౌండర్ అబ్బు సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు

దిశ, కన్నాయిగూడెం : ముప్పనపల్లి సహాయ నిధి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జనగం సమ్మక్క, వ్యవసాయ అధికారి కుంజ మహేష్, ప్రాథమిక వైద్యాధికారి స్నేహ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా 64 యూనిట్ల రక్తం దానం చేయడం ప్రశంసనీయమని వారు అభినందించారు. సహాయ నిధి వ్యవస్థాపకుడు అబ్బు సతీష్ మాట్లాడుతూ, సేకరించిన రక్తాన్ని భద్రాచలం రెడ్ క్రాస్ బ్రాంచ్‌కు అందజేశామని తెలిపారు. రక్తదానం అంటే ప్రాణదానం అని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

Next Story