- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతికందే సమయానికి చేజారి పోయినవా కొడకా..
కాలేజీలో చదువుకునే విద్యార్థుల స్నేహం మరణంలోనూ వారి బంధం వీడలేదు.

దిశ, మల్హర్(మహాదేవపూర్) : కాలేజీలో చదువుకునే విద్యార్థుల స్నేహం మరణంలోనూ వారి బంధం వీడలేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో నలుగురి తోపాటు ఇంకొకరు ఏడుగురు స్నేహబంధంతో వేసవికాలం ఈత కొట్టడం సరదాగా యువకుల ఆనందోత్సవంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి స్థానానికి వెళ్లారు. వర్షాలు లేవు వరద అంతంత మాత్రమే అయినా గోదారిలో భారీ గుంతలు ఉన్నట్లు వారికి తెలియదు.
గోదారిలో స్నానం చేయడానికి దిగిన యువకులు అకస్మాత్తుగా మాయమయ్యారు. శివమై తేలారు. పట్టి శివ అనే ఒక్కరు మాత్రం చకచక్యంగా బయటపడ్డాడు. ఏమైందో తెలియదు నా స్నేహితులు గోదావరిలో దిగినట్టే దిగి మాయమయ్యార అంటూ లబోదిబో మంటూ భయంతో వణికి పోయాడు. అంతా చెప్పేశాడు. మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన విషాద ఘటన మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
గోదావరిలో గల్లంతైన శవాల కోసం రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్న వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూడక తప్పలేదు. గోదారిలో శవాల ఆచూకీ కోసం రాత్రంతా గజ ఈతగాళ్లు పడరాని పాట్లు పడ్డారు. కానీ వారి ఆచూకీ ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు జాలర్లు గుర్తించారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బయటికి తీయడంతో వారి తల్లిదండ్రులు రోదన గోదారి నది గొల్లుమన్నది. వందల మంది శవాలను చూసేందుకు గోదావరి చేరుకోవడంతో గోదారి పరిసర ప్రాంతం కిక్కిరిసింది.అంబటిపల్లి గ్రామానికి చెందిన యువకులు నలుగురు, మహ ముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఒక్కరు పిపి స్తంభంపల్లికి చెందిన మరొకరి తో పాటు ఆరుగురు గల్లంతై గోదారిలో శవమై తేలారు.
అంబటిపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అంబటిపల్లిలో వెంకటస్వామి కి చెందిన ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్ (18), శివ మనోజ్ (15), తోకరి రాజు చెందిన కుమారుడు తొగరి రక్షిత్(13), కర్నాల సమ్మయ్య కు చెందిన కుమారుడు కర్నాల సాగర్ (16), మహ ముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన బొల్లెట్ల పండు (18), పి పి స్తంభంపల్లి కి చెందిన పసుల రాహుల్ (19) అనే స్నేహితులు గోదావరి స్నానానికి వచ్చి గల్లంతు కావడం పట్ల వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
సంఘటన స్థలాన్ని మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ చేరుకొని గల్లంతమైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మారంగా చేపట్టి గజ ఈతగాళ్లు, జాలర్ల సాయంతో యువకుల శవాలను గోదారి నీటి నుంచి బయటికి తీశారు. వారి పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన యువకుల మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు.
మృతుల కుటుంబ సభ్యులకు పర్సనల్ సెక్రెటరీ తో మృతదేహాలను ఆసుపత్రికి తరలించి ప్రభుత్వపరంగా చేయవలసిన కార్యక్రమాలు చేసి దాన సంస్కాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ధైర్య పడవద్దు అంటూ మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండండి మీకు నేను అండగా ఉంటానని ఓదార్పు సందేశాన్ని పంపించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ విషాద ఘటనపై మృతుల కుటుంబాల సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని మహాదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






