- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara 2026 : మేడారం అంతా జన సంద్రమే...
మేడారం జాతర చివరి ఘట్టానికి చేరడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భారీగా జనం తరలివచ్చారు

దిశ మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారం జాతర చివరి ఘట్టానికి చేరడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భారీగా జనం తరలివచ్చారు. మేడారంతో పాటు చుట్టుపక్కలలోని అటవీ ప్రాంతమంతా జన మయంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. మేడారంతో పాటు అటవీ ప్రాంతంలో డేరాలు వేసుకొని ఉంటూనే సమ్మక్క గద్దె మీదకు రాగానే దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జంపన్న వాగు అంతా జనమే...
మేడారం జాతరకు వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. కొంత మంది పుట్టు వెంట్రుకలను కూడా ఇస్తారు. జాతర మొదలై రెండు రోజులు కావడంతో జంపన్నవాగు ఏవైపు చూసినా జనమే దర్శనమిస్తున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా జంపన్న వాగు వద్ద స్నానాలు చేస్తూ దర్శనాలకు క్యూలు కడుతున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం అంతా వెలుగుల మయం చేశారు. జాతరే కాకుండా జంపన్నవాగు వద్ద భారీ లైట్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఒకేసారి వేలాది మంది భక్తులు స్నానాలు చేస్తుండటంతో జంపన్నవాగు వద్ద కాలు పెట్టని పరిస్థితి ఉంది.
పోలీసుల భారీ భద్రత...
మేడారం సమ్మక్క జాతర సందర్భంగా పోలీసులు భారీ భద్రతను చేపట్టారు. వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర భద్రత కొనసాగుతుంది. ములుగు జిల్లా ఎస్పా రాంనాథ్ కేకన్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ తో పాటు మహబూబాబాద్, భూపాలపల్లి, తో పాటు పలు జిల్లాల ఎస్పీలు భద్రతలో పాల్గొంటున్నారు.






