Medaram Jatara 2026 : మేడారం జాతర..స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు.!

by velandi.Saikiran |   (  Updated:2026-01-28 11:26:28  IST  )

మేడారం మహా జాతరకు సెలవులు ప్రకటించాలని మండలంలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Medaram Jatara 2026 : మేడారం జాతర..స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు.!
X

దిశ, బయ్యారం: మేడారం మహా జాతరకు సెలవులు ప్రకటించాలని మండలంలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న మహాజాతరకు మండల వ్యాప్తంగా కుటుంబ సమేతంగా భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతర కావడంతో హాలిడేస్ ప్రకటించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందో లేదో అని మండలంలో చర్చానీయాంశంగా మారింది.

Next Story