వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ లో భారీగా బ‌దిలీలు

by Ratna Kumari |

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలను బదిలీ చేశారు.

వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ లో భారీగా బ‌దిలీలు
X
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో భారీగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలను బదిలీ చేశారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లలో నియమించారు. వారు వెంటనే బదిలీ అయిన స్థానంలో చేరాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా పదోన్నతి పొందిన వారితో పాటు ధీర్ఘకాలికంగా ఒకేచోట పని చేసిన వారిని బదిలీ చేశారు. వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఎస్సైలు 15 మందిని బదిలీ చేశారు. ఏఎస్ఐ నాగమణిని (టాస్క్ ఫోర్స్), జె.రాధమ్మ (పీసీఆర్), బి.శ్రీలత (హన్మకొండ ట్రాఫిక్), కె.లక్ష్మణమూర్తి (మామునూరు), కె.రమాదేవి (ఉమెన్ పోలీస్ స్టేషన్-1), ఏ.సునీత (మటవాడ), వి.సువర్ణ (హన్మకొండ పీఎస్), జి.ప్రవీణ్ (మామునూరు), పి.వెంకటేశ్వర్ రావు (మిల్స్ కాలనీ), పి.సుదర్శన్ (ఇంతజార్గండ్), యాక లక్ష్మి (ఘన్పూర్), బి.నారాయణ (జఫ్ఫర్ ఘడ్), స్వరూపారాణి (ఆత్మకూర్), ఆశాబి (హన్మకొండ), ఎం.శ్రీధర్ (టాస్క్ ఫోర్స్), పి.కట్టస్వామి (పీసీఆర్)కు బదిలీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ లో ధీర్ఘకాలికంగా పనిచేస్తున్న 160 మంది హెడ్ కానిస్టేబుళ్లను కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లకు బదిలీ చేశారు. వీరిలో పదోన్నతి పొందిన వారితో పాటు ఒకేచోట పని చేసిన వారిని కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశారు. వీరితో పాటు మరో 47 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. వీరంతా వెంటనే సంబంధిత స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని కోరారు.
Next Story