- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనుమకొండలో జూన్ 24న సామూహిక వివాహాలు
హనుమకొండ ములుగు రోడ్డులోని సప్త ధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 24న సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ తెలిపారు

దిశ, హనుమకొండ కలెక్టరేట్: హనుమకొండ ములుగు రోడ్డులోని సప్త ధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 24న సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడుతూ.. సామాజిక సేవ దృక్పథంతో శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 గంటలకు వివాహాలు జరిపించడంతో పాటు అవసరమైన బంగారు పూస్తే, మట్టెలు, పెళ్లి బట్టలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. పెళ్లి అనంతరం శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతం చేపించి వచ్చిన బంధువులందరికీ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు బండారి సాయి నారాయణ, మాదారపు సదాశివుడు, ఉమాశంకర్, రేపాల రామచందర్, లయక్, మంతెన వెంకటనారాయణ, కైరిక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






