- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముత్తారం గ్రామంలో వివాహిత అదృశ్యం.. కుటుంబ కలహాలే కారణమా.?
భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన మోకిడి వరుణ్ కుమార్ భార్య శ్రావణి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దిశ భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన మోకిడి వరుణ్ కుమార్ భార్య శ్రావణి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముల్కలగుడెం, ఐనవోలు గ్రామాల సమీప ప్రాంతానికి చెందిన గారంపల్లి చంద్ర రావు కుమార్తె శ్రావణి, 2016లో వరుణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు.
ఇటీవల వివాహిత దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, శ్రావణి 2025 జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముత్తారం గ్రామం నుండి వెళ్లిపోయినట్టు సమాచారం.
తన కుమార్తె కనిపించకపోవడంతో, ఆమె తండ్రి గారంపల్లి చంద్ర రావు ములకనూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎస్సై నండ్రు సాయిబాబు ఆధ్వర్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. శ్రావణి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






