- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విటమన్ టాబ్లెట్లు.. ప్రొటీన్ ఇంజెక్షన్లు.. మావోయిస్టుల కిట్ బ్యాగుల్లో మెడిసిన్
తెలంగాణ- చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రిగుట్టల్ల సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ జోరుగా సాగుతోంది.

దిశ, వరంగల్ బ్యూరో : తెలంగాణ- చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రిగుట్టల్ల సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ జోరుగా సాగుతోంది. మావోయిస్టులను పట్టుకునేందుకు.. మట్టుబెట్టేందుకు కేంద్ర బలగాలు.. వేల సంఖ్యలో కర్రిగుట్టలను జల్లెడబడుతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కూంబింగ్‌లో పెద్దగా ప్రగతి సాధించలేదనే అసంతృప్తితో సీఆర్పీఎఫ్ బలగాలు ఉన్నాయని తెలుస్తోంది. వందలాది మంది మావోయిస్టులు కర్రిగుట్టల్లో దాక్కున్నారని, అగ్రనేతలు సైతం ఇక్కడే మకాం వేసి..కీలక ఆపరేషన్లకు వ్యూహ రచన చేస్తున్నారంటూ సమాచారం అందుకున్న కేంద్ర బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి. అయితే అనుకున్నంత ఈజీగా ఆపరేషన్ ముందుకు సాగడం లేదు. ల్యాండ్ మైన్స్‌ను గుర్తిస్తూ ముందుకు సాగుతున్న కూంబింగ్ బృందాలు.. ఎండ వేడమికి తాళలేక ఇప్పటికే నీరసించి పోయినట్లుగా తెలుస్తోంది. అటు భద్రాచలం.. ఇటు వాజేడు, వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ చికిత్స కోసం కొంతమంది జవాన్లు చేరుతుండటం ఇందుకు నిదర్శనం.
మావోయిస్టుల రహస్యం మందులేనా..?
దాదాపు రెండు వారాలుగా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలకు మావోయిస్టుల జాడ మాత్రం కానరావడం లేదు. పెద్ద ఎత్తున డ్రోన్లు, హెలికాప్టర్లతో పాటు వేల సంఖ్యలో బలగాలతో కర్రిగుట్టలపై నిత్యం నిఘాను కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ వాసుల నుంచి ఎలాంటి సహాయం అందకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఆహారం అందకుండా, నీళ్లు దొరికే ప్రాంతాలపైనా నిఘాను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే మంగళవారం కర్రిగుట్టలపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సదరు మావోయిస్టు కిట్ బ్యాగులో విటమిన్ టాబ్లెట్లు.. ప్రొటీన్ ఇంజెక్షన్లు లభ్యమవడం గమనార్హం. ఈ కారణంగానే రోజుల తరబడి ఆహారం లేకున్నా.. మావోయిస్టులు నీరసించిపోకుండా పోరాటంతో ముందుకు కదులుతున్నారనే అంచనాకు కూంబింగ్ బృందాలు వచ్చినట్లు సమాచారం. అసలు మావోయిస్టులు ఎస్కేప్ అయ్యారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టాబ్లెట్లు, ఇంజక్షన్స్ అంశం వెలుగులోకి రావడం గమనార్హం.






