అప్పు డబ్బులు తిరిగివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య.

by Bhanu |

అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అబ్బాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

అప్పు డబ్బులు తిరిగివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య.
X

దిశ, ములుగు ప్రతినిధి: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అబ్బాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అబ్బాపూర్‌కు చెందిన గాదె రాజు (48) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి నల్లెల్ల జితేందర్‌కు మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల డబ్బులు తిరిగి అడిగితే జితేందర్ కాలయాపన చేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపానికి గురైన రాజు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి, నేరుగా జితేందర్ ఇంటి దాబాపై పడిపోవడంతో స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

అయితే.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పులు తిరిగివ్వకుండా టార్చర్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Next Story