- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల నిర్లక్ష్యానికి బలైన బెస్తవాడ.. అత్త చెరువు తూము లీకేజీతో ఆగమాగం..
మండలంలోని మల్లూరు గ్రామంలోని అత్త చెరువు తూము లీకేజీతో చెరువులోకి వచ్చిన వరద నీరు సమీపంలోని బెస్తవాడ( మైసమ్మ సెంటర్) లోని ఇళ్లలోకి చేరాయి.

దిశ, మంగపేట : మండలంలోని మల్లూరు గ్రామంలోని అత్త చెరువు తూము లీకేజీతో చెరువులోకి వచ్చిన వరద నీరు సమీపంలోని బెస్తవాడ( మైసమ్మ సెంటర్) లోని ఇళ్లలోకి చేరాయి. సోమవారం రాత్రి నుండి మండలంల కురుస్తున్న భారీ వర్షానికి చెరువులోకి చేరిన వరద నీరంతా తూము లీకేజీ నుండి ఇళ్లలోకి చేరడంతో చెరువు సమీపంలోని బెస్తవాడ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. చెరువు తూము లీకేజీ విషయం ఎండాకాలంలో సంబంధిత ఐబీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, దాని ఫలితంగానే చెరవులోకి చేరిన వరదనీరు తమ ఇళ్లను ముంచేసిందని బాదితులు ఆరోపిస్తున్నారు.
వాడలోని ప్రతి ఇంటిలోకి నడుములోతు చేరిన వరద నీటితో ఇళ్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి నెలకొనడంతో ఆయా కుటుంబాలలోని వృద్ధులు, చంటి పిల్లలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే చెరువు కట్ట తెగి తాము నిరాశ్రయులమవుతామని ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత రెవెన్యూ, పోలీస్, ఐబీ అధికారులు స్పందించి వెంటనే తూము లీకేజీకి మరమ్మత్తులు చేసి ముంపుకు గురైన కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.






