- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే యూరియా పంపిణీ చేయాలి
ఎరువులు సమయానికి అందేలా చూడాలని గోదాంల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు

దిశ, గూడూరు: రైతులకు ఎరువులు సమయానికి అందేలా చూడాలని గోదాంల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న ఎస్పీ గూడూరు మండలంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసి గోదాములో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. గోదాముల్లో నిల్వ ఉంచిన ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. యూరియా కోసం రైతులకు ఇబ్బంది పడకుండా చూడాలని యూరియా స్టాక్‌ను ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని అన్నారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం కూడ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో యూరియా అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నారు. అన్ని మండలాలకు యూరియా నిలువలు వచ్చేలా ప్రభుత్వం, అధికారయంత్రాంగం కృషి చేస్తుందని, ప్రతి మండలానికి యూరియా లోడ్ లు వస్తాయని, రైతులు కొంత సంయవనం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు గూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఎమ్మార్వో నాగ భవాని, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిసిఓ ఎన్వి రావు, ఏవో అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.






