స్థానిక రిజర్వేషన్లు ఖరారు

by velandi.Saikiran |   (  Updated:2025-11-23 21:31:06  IST  )

ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేశారు. పాత రిజర్వేషన్లకు అనుగుణంగా రొటేషన్ పద్దతి లో

స్థానిక రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేశారు. పాత రిజర్వేషన్లకు అనుగుణంగా రొటేషన్ పద్దతి లో వార్డులు, సర్పంచ్ రిజర్వేషన్లు నిర్ణయించారు. పాత రిజర్వేషన్లు కొనసాగిస్తూనే రొటేషన్ పద్దతిలో కేటాయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 50 శాతం మించకుండా ఈ రిజర్వేషన్లు సిద్ధం చేశారు. అధికారికంగా నేడు ప్రకటించనున్నారు. ఈ రిజర్వేషన్ బట్టి గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్ తో సీనియర్ నేతల ఆశలకు గండికొట్టింది. ఏళ్ల తరబడి ఎన్నికల్లో పోటీ చేద్దామని ఎదురు చూస్తున్న నేతలని నిరాశలోకి నెట్టింది. సర్పంచులుగా పోటీ చేద్దామని ప్రధాన పార్టీలో కొనసాగుతూ లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన నేతలకు ఈ రిజర్వేషన్లు మింగుడు పడటం లేదు. కనీసం మహిళ రిజర్వేషన్ వచ్చిన కుటుంబ సభ్యులను బరిలోకి దించుదామని భావించిన ఫలితం లేదు. బీసీలకు రిజర్వేషన్ పాత పద్దతి ప్రకారమే కేటాయించడంతో ఉమ్మడి జిల్లాల్లో నేతల తలరాతలు మారిపోయాయి. కొత్తగా తెచ్చిన 42 శాతం అమలు కాకపోవడం వల్ల చాలా మందికి పోటీచేసే పరిస్థితి లేదు. సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలకు మాత్రం ఈ రిజర్వేషన్లు మింగుడు పడటం లేదు. మహిళలకు మాత్రం 50 శాతం రిజర్వేషన్ కలిసొచ్చింది.

వారికి నిరాశే..

ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీల వార్డులు, సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో 1708 గ్రామ పంచాయతీల్లో 50 శాతం మించకుండా రొటేషన్ పద్దతిలో నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా ప్రకారం, బీసీ 2024 ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించారు. గత ఎన్నికలలో నిర్ణయించిన ప్రకారం వంద శాతం రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో మార్చారు. గత ఎన్నికలలో ఒక గ్రామంలో వచ్చిన రిజర్వేషన్లు రొటేషన్ వల్ల మారిపోయాయి. గ్రామాల్లో వార్డులను ఎంపీడీఓలు రిజర్వేషన్లు నిర్ణయించగా గ్రామ పంచాయతీ ఆర్డీవోల ఆధ్వర్యంలో చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నేడు ప్రకటించనున్నారు. అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.గ్రామ పంచాయతీల్లో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్న రొటేషన్ వల్ల గతంలో జనరల్ ఉన్నవి ఈ దపా మారిపోయాయి. బీసీ రిజర్వేషన్లు 23 శాతమే ఉండడం వల్ల 42 శాతం వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. రొటేషన్ పద్దతిలో నిర్వహించిన మహిళలకు మాత్రం సీట్లు తగ్గలేదు.

కొత్తతరం నేతలకు రానున్న అవకాశం

గ్రామాల్లో సర్పంచ్ లుగా పోటీ పడేందుకు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అధికార పార్టీ నేతలు ఎదురు చూశారు. గత ఎన్నికల్లో పోటీ పడ్డ నేతలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో అవకాశం వస్తుందని భావించారు. బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడం, పాత రిజర్వేషన్ ప్రకారమే రొటేషన్ పద్దతిలో నిర్ణయించిన చాలా మందికి అవకాశం రాలేదు. కుటుంబ సభ్యులకు కూడా కొన్నిచోట్ల అవకాశం లేదు. బీసీ రిజర్వేషన్లు అమలు లేకపోవడం, రొటేషన్ తో మారడం వల్ల చాలా గ్రామాల్లో సర్పంచ్ కు పోటీ పడుదమని భావించిన నేతలకు నిరాశే మిగిలింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రజలను కలుస్తు ప్రయత్నాలు కొనసాగించారు. పాత పద్దతిలో రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇప్పటి వరకు ఎదురుచూసిన నేతలకు కలిసి రాలేదు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలకు కూడా ఈ రిజర్వేషన్లు మింగుడు పడటం లేదు.

ఇప్పటి వరకు కార్యకలాపాలు నిర్వహించిన వారికి గ్రామాల్లో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రాకపోవడం వేరే సామాజిక వర్గాలకు ఖరారు కావడంతో లక్షలు ఖర్చుచేసిం వారికి ఫలితం లేకుండా పోయింది. ఇన్ని రోజులు పదవులపై ఆశపడి డబ్బులు ఖర్చు పెట్టిన నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్ణయించిన రొటేషన్ పద్దతిలో మారడంతో కొత్త వారికి కలిసి వస్తుంది. మాజీ సర్పంచ్ లకు చాలా చోట్ల అవకాశం లేకుండా పోయింది. ఖర్చు పెట్టిన వారికి అవకాశాలు రాకపోగా ఎలాంటి పార్టీ సంబంధం లేని వారిని బరిలోకి దించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రిజర్వేషన్లతో ఎన్నికలను నిర్వహిస్తే గ్రామాల్లో సర్పంచ్ లనుంచి వార్దు సభ్యుల వరకు కొత్తతరం నేతలకు అవకాశం రానుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు నేడు ప్రకటించనున్నారు.

Next Story