- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో ఏరులై పారుతున్న మద్యం.. రెచ్చిపోతున్న సిండికేట్
ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

దిశ, వెంకటాపురం (నూగూరు): ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. సిండికేట్ గా మారిన మద్యం వ్యాపారులు తాము అమ్మిందే రేటు తమ రూట్ సపరేటు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. బెల్టు షాపులకు యథేచ్ఛగా మద్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.30 నుంచి రూ.40 అధిక ధరలకు బెల్టు షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం దుకాణాల్లో మద్యం ప్రియులు అడిగిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి బెల్టుషాపుల్లో కొనుగోలు చేసేలా చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
బెల్టు షాపులకు తరులుతున్న మద్యం..
మద్యం దుకాణాలు దక్కించుకున్న బినామీలు షాప్ లో మద్యం అందుబాటులో లేకుండా చేసి ఆటోల్లో మండల వ్యాప్తంగా బెల్టు షాపులకు తరలిస్తున్నారు. ఉదయమే ఏర్పాటు చేసుకున్న ఆటోల్లో మద్యం బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. వైన్స్షాపులు సమయపాలన పాటించడం లేదు. రెండు మండలాల్లో మద్యం దుకాణాలు అసలు సమయపాలన పాటించడం లేదని మద్యంప్రియులు ఆరోపిస్తున్నారు. ఉదయం 7 గంటలకే మద్యం దుకాణం తెరచి బెల్ట్ షాపులకు ఆటోల ద్వారా చేరవేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్యం సిండికేట్ ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బెల్టుషాపులు ప్రోత్సహిస్తున్నారు..
ఏజెన్సీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న బినామీలు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. అధిక రేట్లకి అమ్మకాలు చేయడంతో పాటు బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. మద్యం దుకాణాలను సమయపాలన పాటించకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
–ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాసం రమేష్






