- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళితులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒకటే : కడియం శ్రీహరి
అంటరానితనానికి, అణచివేతకు గురైన దళిత బిడ్డలను రాజకీయంగా, ఆర్థికంగా, సామజికంగా సమూచిత స్థానం కల్పించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దిశ, లింగాల ఘణపురం : అంటరానితనానికి, అణచివేతకు గురైన దళిత బిడ్డలను రాజకీయంగా, ఆర్థికంగా, సామజికంగా సమూచిత స్థానం కల్పించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ గుగ్గిల నర్సయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఇందిరా గాంధీ అని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దళితులు కాంగ్రెస్ పార్టీ వెంటే నడిచారాని అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరిగే ధైర్యం ఒక్క దళితులకే ఉందని ఉందన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే సమాజంలో నిలబడగలుగుతున్నామని తెలిపారు.రాజకీయాలలో అందరికీ అవకాశాలు ఒకేసారి రావని, మన వాళ్లకు అవకాశం వస్తే మనమే సపోర్ట్ చేయడం లేదని అన్నారు.
దళితులకు అవకాశం వచ్చినా పని చేసే అవకాశం మాత్రం ఇవ్వరని అన్నారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో పెత్తందార్లది, భూస్వాములదే పెత్తనం ఉంటుందన్నారు. 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, చాలా మందిపై అవినీతి, ఆక్రమాల ఆరోపణలు వస్తుంటాయని, కానీ ఈ నాటికీ కడియం శ్రీహరి పై అవినీతి ఆరోపణలు చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. దేవునూరు గుట్టలలో 2వేల ఎకరాలు కబ్జా చేశానని, బిఆర్ఎస్ పార్టీలో బీ ఫామ్ తీసుకొని డబ్బులు తీసుకున్నానని కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నాపదవికి రాజీనామా చేస్తానన్నారు.మన జాతీ ఎదగడం ఇష్టం లేని వారు కుల అహంకారంతో మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి,ఎవరికీ ఎం కావాలన్నా ఇచ్చుకో, పుచ్చుకో అనే రీతిలో వ్యవహరించాడని అన్నారు.
పదవులు, పనులు, పథకాలు అమ్ముకున్నాడని, ఆఖరికి దళిత బంధు పథకానికి మన దళితులవద్దనే పైసలు తీసుకొని మోసం చేసాడని ఆరోపించారు. దళితుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. దళిత కు ఎలాంటి కష్టం రాకుండా కంటికిరెప్పలా,కాపాడుకుంటానన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, యువజన నాయకులు సంపత్, మాజీ సర్పంచ్ కడారి కృష్ణ, గండి శ్రీనివాస్, పలువురు పాల్గొన్నారు.






