బాల్య వివాహంతో బ‌తుకు ఆగం

by Ratna Kumari |

బాల్య వివాహాలతో మైనర్ల బతుకు ఆగమైతదని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు.

బాల్య వివాహంతో బ‌తుకు ఆగం
X

దిశ‌, మంగ‌పేట : బాల్య వివాహాలతో మైనర్ల బతుకు ఆగమైతదని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో బాగంగా శుక్రవారం మండలంలోని మల్లూరు, నర్సాపురంబోరు గ్రామాల్లో బాల్య వివాహ నిరోధక చట్టం-2006, బాలకార్మిక నిషేధ చట్టం క్రమ బద్ధీకరణ-2016 గురించి గ్రామస్థులకు అవగాహన క‌ల్పించారు. చట్టాల తీరును ఉల్లంఘించిన వారికి విధించే శిక్షలను గూర్చి ప్రేమలత వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో బాలల పరిరక్షణ విభాగము, బాల్యవివాహ నిషేధ చట్టం గురించి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పరిరక్షణ అధికారి ఎన్.హరికృష్ణ, కౌన్సిలర్ రజిని, సూపర్వైజర్ సుదర్శన్, కేస్ వర్కర్ వై.చంటి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ ఇమ్మాన్యుయేల్ లు పాల్గొన్నారు

Next Story