గ్రంధాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు

by Ratna Kumari |

గ్రంధాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయ‌ని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సీ.హెచ్ సురేందర్ పేర్కొన్నారు.

గ్రంధాలయాలు విద్యార్థుల  భవిష్యత్తుకు బంగారు బాటలు
X

దిశ‌, వ‌ర్థ‌న్న‌పేట : గ్రంధాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయ‌ని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సీ.హెచ్ సురేందర్ పేర్కొన్నారు. విద్యా వారోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం గ్రంథాల‌య జ్ఞానోత్సవాన్ని నిర్వ‌హించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సీ.హెచ్ సురేందర్ హాజ‌రై మాట్లాడారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థాయికి చేరిన చాలా మంది గ్రంధాలయాల ద్వారా జ్ఞానాన్ని పొందారన్నారు. కల్లెడలోని ఆర్డిఎఫ్ ప్రిన్సిపాల్ ఏ. జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంధాలయాలను బాగా ఉపయోగించుకోవాలని కోరారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ కళాశాలకు రామకృష్ణ సేవా సమితి వారు పుస్తకాలను వితరణ చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. విద్యార్థుల సైతం పుస్తకం పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం కళాశాలకు పుస్తకాలను అందించిన దాతలను ఉత్తమ పాఠకులను సన్మానించారు. పర్వతగిరి లోని రామకృష్ణ సేవా సమితి వారు వివిధ పుస్తకాలను కళాశాల గ్రంధాలయానికి వితరణ చేశారు. కార్యక్రమంలో విద్య వారోత్సవాల నోడల్ అధికారి డాక్టర్ జి రజిత, గ్రంధాలయ ఇన్ చార్జి డాక్టర్ బి. శ్వేత, అధ్యాపకులు పాల్గొన్నారు.

Next Story