కార్పొరేషన్ చెత్త కంపు.. కాంట్రాక్ట్ పోస్టులు అమ్ముకున్న నాయకులు

by Dishanational2 |
కార్పొరేషన్ చెత్త కంపు.. కాంట్రాక్ట్ పోస్టులు అమ్ముకున్న నాయకులు
X

దిశ, హన్మకొండ : వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లోఔట్ సోర్స్ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అమ్ముకొన్నారని జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ లోని పార్టీ కార్యాలయం‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ కార్పొరేషన్ లో అవినీతి కంపు కొడుతుందని కార్మికుల జీవితాలతో ఆటలాడుతూ కొందరు ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. గెటర్ మునిసిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్‌గా పనిచేసిన 52 మంది కార్మికులను తొలగించడం వెనుక లక్షల అవినీతి దాగివుందన్నారు. కార్పొరేటర్ నుండి ఎమ్మెల్యే,ఎంపీ,మంత్రుల స్థాయి ప్రతినిధులు లక్షల రూపాయలు కార్మికుల వద్ద దండుకొని పైరవీలు చేసి నియమించుకొని కరోన సమయంలో కష్టపడి పనిచేసిన వారిని తొలగించి అన్యాయం చేయడమే కాకుండా ఈ. ఎస్.ఐ పి.ఎఫ్ రాకుండ చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్ కార్మికునిగా నియమం కోసం పుస్తెలు ఇంటి‌ని తాకట్టు పెట్టి పనికోసం వచ్చిన నిరుపేద కార్మికుని నుండి ఒక్కక్కరి వద్ద 3 లక్షల నుండి 5 లక్షలు వసూలు చేశారని, ప్రతినెలా కొత్త లిస్టును తయారు చేస్తూ ఔట్ సోర్సింగ్ కార్మికులు జీవితాల ను అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ రోడ్డున పడవేసరాని తమవద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని నిరూపించే అందుకు అధికారులు, కాంట్రాక్టర్ సంభాషణ ఆడియో వాయిస్ రికార్డ్ లను వినిపించారు. ప్రజాప్రతినిధులు కాంట్రాక్ట్ ను బెదిరించడం‌తో పత్తా లేకుండా పోవడం తో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డివిజన్‌లలో ఎక్కడ పడితే అక్కడ అవినీతి కంపు చెత్త పేరుకు పోయిందని ఎద్దేవా చేశారు. గ్రేటర్‌లో ఔట్ సోర్సింగ నియామకాల్లో జరిగిన అవకతవకల పై విజిలెన్స్ సి.బి.ఐ చే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా తొలసగించిన కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని కార్మికుల తరుపున కార్మికులతో కలసి వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసామని తెలిపారు.


Next Story

Most Viewed