'టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే స్కామ్‌ల కట్ట.. ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం'

by Vinod kumar |
టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే స్కామ్‌ల కట్ట.. ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం
X

దిశ, ములుగు ప్రతినిధి: భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది యువకుల విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తాకట్టు పెట్టిన కల్వకుంట్ల కవిత వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన పాత్రురాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు దేశవ్యాప్తంగా తెలంగాణ గౌరవాన్ని దిగజార్చిందని అన్నారు. మద్యం నుండే రెవెన్యూలో పెంచుకోవాలని చూడడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు ఆలోచన చేస్తుందని అన్నారు.

2014 సంవత్సరంలో సుమారు 3,500 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పొందుతున్న నాటి నుండి నేటి వరకు దాదాపు 37 వేల కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయం నుండి పొందుతున్నది అని అన్నారు. అంటే తెలంగాణ ప్రజలు మనకు అర్థమవుతుంది ఎంతగా తెలంగాణ ప్రజానీకాన్ని మత్తులోకి దించి వారి ఆరోగ్యాలతో చెలగాటలాడి, ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు సంపాదించుకున్నదని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి దారితీస్తుందని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో దొరికిన కవితను వెంటనే పార్టీ నుండి భర్తప్ చేసి ఇటువంటి వాళ్లకు రాజకీయం లో ప్రవేశం లేకుండా చేయాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే స్కామ్‌ల కట్టా అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడుతుందని తెలంగాణ ప్రజానీకానికి అర్థమైందని అన్నారు. బంగారు తెలంగాణ దేశం మొత్తం లో అప్పుల తెలంగాణ గా మార్చిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా కార్యదర్శి రవీంద్ర చారి, జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, జిల్లా కార్యదర్శి సిరికొండ బలరాం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed