- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ బలోపేతంపై నేతల దృష్టి.. ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ఇంచార్జీలు
బీఆర్ఎస్ మరోసారి సంస్థాగత బలోపేతం దృష్టి పెట్టింది. సభ్యత్వం నుంచి కమిటీల వరకు నిజమైన కార్యకర్తలకే అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. డిజిటలైజేషన్ పద్దతిన సభ్యత్వ నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : బీఆర్ఎస్ మరోసారి సంస్థాగత బలోపేతం దృష్టి పెట్టింది. సభ్యత్వం నుంచి కమిటీల వరకు నిజమైన కార్యకర్తలకే అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. డిజిటలైజేషన్ పద్దతిన సభ్యత్వ నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వారిగా సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. గ్రామ, మండలం, మున్సిపాలిటీల పరిధిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయకర్తను నియమించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సభ్యత్వ నమోదు కోసం ఇద్దరు ఇంచార్జీలను నియమించగా వారి ఆధ్వర్యంలోనే నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ పద్దతిన సభ్యత్వ నమోదును చేపట్టడంతో పాటు నిజమైన కార్యకర్తలను కాపాడుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మండలం పరిధిలో సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు బూతుల వారిగా కమిటీలను నియమించి సభ్యత్వ నమోదును చేస్తారు.
గతంలో లాగా క్యాడర్ కార్యకర్తల నమోదులో పనిచేసే వారికే అవకాశం ఇవ్వనున్నారు. ఈ ధపా సభ్యత్వ సంఖ్య కంటే వాసీపైన దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు మరో రెండున్నర ఏళ్లలో జరుగనుండటంతో ముందస్తుగానే సంస్థాగత నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై జిల్లా ఇంచార్జిలను నియమించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఇంచార్జిలను సభ్యత్వ నమోదు కోసం నియామకం చేశారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిని వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాల ఇంచార్జిలుగా నియమించగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇంచార్జిగా నియమించారు. వీరి ఇద్దరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లాలో కొనసాగనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తారు. మండల పరిధిలోనూ సమన్వయకర్తల నియామకం చేసి ఈ సభ్యత్వ నమోదు చేపడుతారు. ప్రతి బూతుకు ఇద్దరు కార్యకర్తలకు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇవ్వడంతో పాటు వారి ద్వారా డిజిటలైజేషన్ పద్దతిలో నియామకం చేస్తారు.
సీనియర్ నేతలది తలోదారి..
గత అసెంబ్లీలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో సంవత్సరం పాటు నిరుత్సాహం కనిపించింది. పదేళ్లు అధికారంలో ఉండి ఎన్నికలలో ఓడిపోవడం, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొన్ని రోజులు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపించడం, ఎంపీలు గెలవకపోవడంతో కార్యకలాపాలు తక్కువగా చేపట్టారు. గడిచిన సంవత్సరం కాలంగా మాజీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యకలాపాల్లో పాల్గొంటూ క్యాడర్ కు అండగా ఉన్నారు. గత గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకీ ధీటుగానే సీట్లు సాధించడంతో క్యాడర్ లో నమ్మకం పెరిగింది. రెండున్నర ఏళ్లు పూర్తి కావడం వచ్చే ఎన్నికలకు మరో రెండున్నర ఏళ్లే ఉండటంతో ఎక్కువ మంది దృష్టి పెట్టారు. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ముఖ్యమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధం కావడం వల్ల గ్రామ మండల నేతలంతాపోటీకి సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం చేపట్టిన సభ్యత్వ నమోదుపై దృష్టి సారిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎక్కువ మొత్తంలో చేపట్టడంతో పాటు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల వరకు మరింత బలోపేతం అయ్యేందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు క్యాడర్ బలోపేతం చేసి ప్రజల మద్దతును కూడగట్టి మళ్లీ గెలిచే విధంగా వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో బీఆర్ఎస్ సీనియర్ నేతలది తలోదారి ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వీరిని సమన్వయం చేసేవారే కరువయ్యారు. ఎవరికి వారే నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో మాజీ సీఎం కేసీఆర్ పలు దపాలు ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలంతా కలిసికట్టుగా సమన్వయంతో నడిచి క్యాడర్ కు అందుబాటులో ఉంటేనే బలోపేతం అవుతుందని నేతలు భావిస్తున్నారు. ఎవరికివారే కార్యకలాపాలు చేపట్టిన సభ్యత్వ నమోదు చేసిన సమన్వయం లేకుంటే మళ్లీ పాత పరిస్థితే ఏర్పడుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. సీనియర్ నేతలతో పాటు రాష్ట్ర నేతలు ఉమ్మడి జిల్లాపై దృష్టి పెడితే ప్రజల మద్దతు రానుంది.






