తహసీల్దార్ ఆఫీసులో లేడీ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం.. వారి వేధింపులే కారణమా..?

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-08 14:04:27  IST  )

వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎమ్మార్వో కార్యాలయంలో కలకలం రేగింది. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కల్పన సోమవారం సాయంత్రం ఆఫీసులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

తహసీల్దార్ ఆఫీసులో లేడీ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం.. వారి వేధింపులే కారణమా..?
X

తహసీల్దార్ ఆఫీసులో లేడీ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం.. వారి వేధింపులే కారణమా..?

* నల్లబెల్లి ఎమ్మార్వో కార్యాలయంలో కలకలం

దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎమ్మార్వో కార్యాలయంలో కలకలం రేగింది. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కల్పన సోమవారం సాయంత్రం ఆఫీసులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే తోటి సిబ్బంది ఆమె చేతిలోని డబ్బా లాక్కొని, తహసీల్దార్ సొంత వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల వేధింపుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పని ఒత్తిడి కారణమా? అన్న చర్చ నల్లబెల్లిలో జోరందుకుంది. పూర్తి విచారణ అనంతరం ఘటనకు గల కారణాలు వెలుగులోకి రానున్నాయి.

Next Story