జిల్లా రిజిస్ట‌ర్ కార్యాల‌యంలో త్రాగునీటి కొర‌త

by Ratna Kumari |

హనుమకొండ వడ్డేపల్లిలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో త్రాగునీరు లేక రిజిస్ట్రేషన్ పని కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా రిజిస్ట‌ర్ కార్యాల‌యంలో త్రాగునీటి కొర‌త
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : హనుమకొండ వడ్డేపల్లిలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో త్రాగునీరు లేక రిజిస్ట్రేషన్ పని కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ఆవరణలో ఫ్రిడ్జి ఉన్నప్పటికీ నీరు పోయకపోవడంతో తుప్పు పట్టి వినియోగానికి పనికి రాకుండా పోయింది. రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చే ప్రజలు బయట నుంచి వాటర్ బాటిల్లు కొనుక్కొని త్రాగాల్సిన‌ పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ల కోసం వేలాది రూపాయలు వసూలు చేసే అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయానికి వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Next Story