భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

by Ratna Kumari |

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు జిల్లా కేంద్రంలోని భ‌ద్ర‌కాళీ అమ్మవారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్
X

దిశ‌, హన్మకొండ టౌన్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు జిల్లా కేంద్రంలోని భ‌ద్ర‌కాళీ అమ్మవారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పూజ అనంత‌రం ఆల‌య మ‌హా మండ‌పంలో వేద పండితులు, అర్చ‌కులు ఆశీర్వాదం నిర్వ‌హించి.. అమ్మ‌వారి శేష వ‌స్త్ర‌ములు బ‌హుక‌రించి ప్రసాదం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, తాటికొండ రాజయ్య, వొడితల సతీష్, మాలోతు కవిత త‌దిత‌రులున్నారు.

Next Story