- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌పై కేటీఆర్ నజర్.. 'ఉమ్మడి' పోరుకు బీఆర్ఎస్ సన్నద్ధం!
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరశంఖం! వరంగల్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ. సభ్యత్వ నమోదు, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ.

దిశ, వరంగల్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పై పోరుకు సన్నద్ధమవుతున్నారు. కేసీఆర్ పాల్గొన్న జగిత్యాల సభ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నియోజక వర్గాలపై దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లాలో జరిగే పంచాయతీ, జెడ్పీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, సంస్థాగత బలోపేతం, సభ్యత నమోదుకు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కీలక సీట్లను సాధించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ మెరుగైన తీరు సాధించే విధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షించడం తో పాటు అధికార పక్షంను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు.
కేసీఆర్ సభతో జోష్..
బీఆర్ఎస్ జగిత్యాల సభ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్న తర్వాత నేతల్లో జోష్ కనిపిస్తుంది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాపై కేటీఆర్ నజర్ పెట్టారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలతో హైదరాబాద్ లో 12 నియోజకవర్గాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ పరిస్థితిని నియోజకవర్గాల వారీగా చర్చించడం తో పాటు రాబోయే రోజుల్లో బలోపేతంపై దృష్టి పెట్టే విధంగా దిశా నిర్దేశం చేశారు.
గ్రామ, వార్డు నుంచి సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని, పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల ఆధారంగా ఓటరు జాబితాపై, సవరణలపై దృష్టి పెట్టడం తో పాటు కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని కోరారు. పార్టీ పనితీరును నియోజకవర్గాల వారీగా మెరుగుపర్చుకోవాలన్నారు . వచ్చే మండల పరిషత్, జిల్లా పరిషత్ పై నజర్ పెట్టాలన్నారు. కీలక జెడ్పీలను కైవసం చేసుకోవడం తో పాటు వరంగల్ కార్పొరేషన్ లో మళ్లీ పాగా వేసే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. డివిజన్ల వారిగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలో పనిచేసే వారికే అవకాశాలు ఇవ్వాలని కోరారు.
అధికార పక్షానికి ధీటుగా..
ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరికి వారే అన్న రీతిలో బీఆర్ఎస్ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కలిసి పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏవీ ఇప్పటివరకు చేయలేదు. కాంగ్రెస్ కు ధీటుగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మరికొన్ని నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నారు. అధికార పక్షంకు ధీటుగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలే ఎజెండాగా కలిసికట్టుగా ముందుకు పోయేందుకు నిర్ణయం తీసుకున్నారు.
సమీక్షా సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రవీంధర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు వినోద్, కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, శంకర్ నాయక్, జెడ్పీ మాజీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఇతర నేతలు పాల్గొన్నారు.






