- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాయ్ రాజా.. కాయ్.. కోడి పందెం రాయుళ్లు ఆరెస్ట్..
ఏటూరునాగారం మండలంలోని దోడ్ల గ్రామంలో కోడి పందెం నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని దోడ్ల గ్రామంలో కోడి పందెం నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం సమయానికి నమ్మదగిన సమాచారంతో అక్కడికి చేరుకున్న సీఐ అనుముల శ్రీనివాస్, ఏస్ఐ రాజ్‌కుమార్, పీఏసీఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో ఇస్లావత్ లక్ష్మణ్, తోర్రం బక్కయ్య, ఏరికొండ రామకృష్ణ, నిమ్మల ఏడుకొండలు, మడికంటి రణదీర్ అనే ఐదుగురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
వారివద్ద నుండి రూ.24,370 నగదు, నాలుగు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు. పేకాట, కోడి పందెం, గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు సతీష్, గోపి, అజయ్, హరీష్, నరేష్ పాల్గొన్నారు.






