- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిడ్నాప్ యత్నం భగ్నం.. తండ్రి ధైర్యానికి శభాష్..!
జనగామ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం (MCH)లో బుధవారం రాత్రి పసికందు కిడ్నాప్ యత్నం కలకలం రేపింది.

దిశ, జనగామ : జనగామ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం (MCH)లో బుధవారం రాత్రి పసికందు కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. అప్రమత్తంగా వ్యవహరించిన శిశువు తండ్రి సాహసంతో నిందితురాలు పోలీసుల చేతికి చిక్కింది. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలక్పూర్ గ్రామానికి చెందిన కరుణాకర్- కీర్తన దంపతులకు ఈ నెల 2న మగబిడ్డ జన్మించారు. పసికందుకు పచ్చకామెర్లు ఉండటంతో ఆసుపత్రిలోని SNCU (Special Newborn Care Unit)లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రఘునాథపల్లి మండలానికి చెందిన టి.జ్యోతి అనే మహిళ, తాను శిశువు తల్లినని నమ్మబలికి వార్డులోకి ప్రవేశించింది. సిబ్బంది కళ్లుగప్పి పసికందును ఎత్తుకుని ఆటోలో పరారయ్యేందుకు ప్రయత్నించింది.
సినిమా స్టైల్ ఛేజింగ్
శిశువు కనిపించకపోవడంతో తండ్రి కరుణాకర్ వెంటనే స్పందించాడు. ఆసుపత్రి సిబ్బంది సాయంతో ఆటోను వెంబడించి, జనగామ శివారులోని షామీర్‌పేట వరకు తరుముతూ వెళ్లి నిందితురాలిని పట్టుకున్నాడు. స్థానికులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆమెతో ఉన్న మరో మహిళ పరారైంది.
భద్రతపై ప్రశ్నలు
అత్యంత రక్షణ ఉండాల్సిన SNCU వార్డులోకి గుర్తు తెలియని వ్యక్తులు సులభంగా ప్రవేశించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
పోలీసులు నిందితురాలు టి.జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆసుపత్రిలోని CCTV ఫుటేజీని పరిశీలిస్తూ, పరారైన మరో మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పసికందును సురక్షితంగా తిరిగి పొందడం ఉపశమనం కలిగించినా, ఆసుపత్రి భద్రతపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.






