- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో కేసముద్రం మండల యువకుడు అనుమానాస్పద మృతి
కేసముద్రం మండలానికి చెందిన యువకుడు హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.

దిశ, కేసముద్రం: కేసముద్రం మండలానికి చెందిన యువకుడు హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బేరువాడ గ్రామానికి చెందిన గుగులోత్ వెంకన్న, సరోజ దంపతుల కుమారుడు వినోద్ కుమార్ (23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో స్నేహితులతో కలిసి ముషిరాబాద్ ప్రాంతంలోని గాంధీనగర్ లో అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనతో పాటు రూమ్ లో ఉండే స్నేహితులు రెండు రోజుల క్రితం వారి స్వస్థలం వెళ్లగా వినోద్ ఒక్కడే రూమ్ లో ఉన్నాడని తెలిపారు.
వినోద్ తల్లితండ్రులు శనివారం నుంచి ఫోన్ చేస్తుంటే స్పందింకపోవడంతో సమీపంలోని బందువులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం వినోద్ ఉంటున్న రూమ్ కి వెళ్లి చూడగా అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడని తెలిపారు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.






