సొంతింటి కలను నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్: మంత్రి సత్యవతి రాథోడ్

by Disha Web Desk 11 |
సొంతింటి కలను నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్: మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, మహబూబాబాద్ టౌన్: నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి సొంతింటి కలను నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో మహబూబాబాద్ తాసిల్దార్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో 58 , 59 ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలతో ప్రభుత్వ భూమిలోని ఇళ్లకు క్రమబద్ధీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మంత్రి అర్హులైన నిరుపేదలకు పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టాలు రానివారు ఆందోళన చెందొద్దని అన్నారు. పన్నుల చెల్లింపులతో అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తప్పనిసరిగా కల్పిస్తామన్నారు. అర్హులైన నిరుపేదల అందరికీ పట్టాలందుతాయని వలస వచ్చిన వారిని ప్రోత్సహించొద్దన్నారు. త్వరలోనే సమగ్ర సర్వే చేపడతామని అందరికీ మేలు జరుగుతుందన్నారు. పట్టణం నాలుగు వైపులా జాతీయ రహదారులు వస్తున్నాయని పట్టణ అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నదని ప్రభుత్వ అవసరాలకు కూడా ప్రభుత్వ భూమి అవసరం ఉందని ప్రజలు గుర్తించుకోవాలన్నారు.

350 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని త్వరలో మెడికల్ కళాశాల పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొని నిరుపేద ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ ఆర్డీవో కొమరయ్య మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహసీల్దార్ నాగ భవాని, కౌన్సిలర్లు బి అజయ్ సారధి, మార్నేని వెంకన్న , పుష్పలత, శ్రీదేవి, ఫరీదా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed