- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం..!
దళిత నాయకులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత కార్యకలాపాలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ శ్రేణులు వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి పై మండల కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు.

దిశ, రఘునాథపల్లి : దళిత నాయకులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత కార్యకలాపాలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ శ్రేణులు వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి పై మండల కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారిజోడు రాంబాబు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ రెడ్డి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. నిజాయితీకి నిదర్శనమైన కడియం శ్రీహరి లాంటి నేత పట్ల అనుచితంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానానికి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాసంపల్లి లింగాజీ, గాదె మహేందర్ రెడ్డి, నామాల బుచ్చయ్య, గొరిగే రవి, ఎండి బాషుమియా, పోకల శివకుమార్, సర్పంచులు బొమ్మ వీరస్వామి, వల్లాల అశోక్,డేగల రాజశేఖర్, ఈర్యా నాయక్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కావటి భాస్కర్, పైడిపల్లి కృష్ణ, కుంకీస్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.






