ధ్రువీకరణపత్రాలకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

by Bhanu |

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది.

ధ్రువీకరణపత్రాలకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
X

దిశ, కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులకు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాల కోసం రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ తాసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీధులలో లేకపోవడంతో మిగతా అధికారులు ఆడిందే ఆటగా పడింది పాటగా కొనసాగుతుందని విద్యార్థులు, ప్రజలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయానికి వెళ్తే పట్టించుకోవడంలేదని అధికారులు మాత్రం సుదూర ప్రాంతాల నుండి సమయపాలన పాటించకుండా ఉదయం 11 గంటలకి కార్యాలయానికి రావడం తిరిగి 2:30 వరకు వెళ్లడం జరుగుతుందని దీంతో మండల ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులపై మండల ప్రజలు మండిపడుతున్నారు. సమయపాలన పాటించని అధికారులపై ఉన్నతాధికారుల ఆరాతిసి చర్యలు తీసుకోవాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Next Story