ప్రాణ స్నేహితుడికి కడియం శ్రీహరి కన్నీటి వీడ్కోలు

by Bhanu |

సీనియర్ నాయకులు దేశినేని హనుమంతరావు కన్నుమూశారు. ఈ విషాద సమయంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనాపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, డాక్టర్ నజీర్ సహా పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రాణ స్నేహితుడికి కడియం శ్రీహరి కన్నీటి వీడ్కోలు
X

దిశ, హనుమకొండ : సీనియర్ నాయకులు దేశినేని హనుమంతరావు కన్నుమూశారు. ఈ విషాద సమయంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనాపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, డాక్టర్ నజీర్ సహా పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తన ప్రాణ స్నేహితుడైన హనుమంతరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అంతిమయాత్రలో స్వయంగా పాల్గొని పాడె మోశారు. హనుమంతరావుని కోల్పోవడం తీరని లోటని, ఇది తనకు వ్యక్తిగతంగా పెద్ద నష్టమని, ఆ లోటు ఎప్పటికీ నింపలేనిదని పేర్కొన్నారు. అంతిమయాత్ర ప్రారంభం నుంచి అంత్యక్రియల వరకు ఎమ్మెల్యే శ్రీహరి అక్కడే ఉండి, హనుమంతరావు కుటుంబ సభ్యులకు మద్ధతుగా నిలిచారు.


వారికి ధైర్యం చెప్పి, ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య భావోద్వేగానికి లోనయ్యారు. హనుమంతరావు తమ కుటుంబంలో ఒకరిగా భావించేవారని, ఆయన మరణం తీరనిలోటని అన్నారు. అంత్యక్రియల కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమంతరావు సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు.

Next Story